అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన టిడిపి నేత‌లు

అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన టిడిపి నేత‌లు

హైదరాబాద్, జులై 4, అద్దం న్యూస్ :   సమ సమాజ నిర్మాణం కోసం భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించి, వారి గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128 వ జయంతి సందర్భంగా హైద‌రాబాద్ ట్యాంక్ బండ్ పై శుక్ర‌వారం జ‌రిగింది. తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం కన్వీనర్ పిన్న‌మ‌నేని సాయిబాబా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… అడవి బిడ్డలకు అండగా ఉంటూ తెలుగునాట ఉదయించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో తొలి తరం సమర యోధులలో అల్లూరి సీతారామారాజు ఒకరన్నారు. ఆయన జీవితాన్ని ఈతరం స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ఆశయాలను ఆకలింపు చేసుకొని, ఈనాటి నిరంకుశమైన నీతిబాహ్యమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. ఆ మహనీయుని చరిత్ర భావి తరాలకు స్ఫూరిగా నిలిచేవింధగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని సాయిబాబా కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, భాను ప్రకాష్, రవి తదితరులు నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page