Saturday, September 19, 2026
No menu items!
HomeAPప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై టిడిపి నిరంత‌రం పోరాటం

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై టిడిపి నిరంత‌రం పోరాటం

📰 Generate e-Paper Clip

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై టిడిపి నిరంత‌రం పోరాటం
– టి టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్‌

ఖైరతాబాద్, జూలై 19, ( అద్దం న్యూస్ ) :   ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై టిడిపి నిరంత‌రం పోరాటం చేస్తోంద‌ని టి టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో, బూత్ స్థాయిలో బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా  ” తెలుగుదేశం – ప్రజాపథం ” కార్యక్రమం ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీ డివిజన్ దేవరకొండ బస్తిలో డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి అరుణ్ ఆధ్వర్యంలో జ‌రిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ బస్తీలో ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి టి టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్‌, మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన, సికింద్రాబాద్ పార్లమెంటు కో– ఆర్డినేట‌ర్ నల్లెల్ల కిషోర్, జివిజి.నాయుడు, పి.అశోక్, ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అనంతరం ముఖ్య అతిథుల సమక్షంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చి, జై తెలుగుదేశం… నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలు చేసారు. ఈ ప్రజాపథం కార్యక్రమంలో నాయకులు పాదయాత్రగా పాల్గొని బస్తీలోని వీధుల్లో పర్యటిస్తూ స్థానిక కమ్యూనిటీ హాలులో ప్రస్తుతం జరుగుతున్న SIR కార్యక్రమం ( ఓటరు సమగ్ర సవరణ ) జరుగుతున్న తీరును అరవింద్ కుమార్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాయకులను నేరుగా కలుసుకున్నారు. బస్తీలో తాము ఎదుర్కొంటున్న పలు స్థానిక సమస్యలను ప్రజలు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.

టి టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్‌, మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన లు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ పోరాడుతుందన్నారు. స్థానికంగా ఉన్న ప్రతి సమస్యను త్వరితగతిన సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారమయ్యే వరకు ప్రజల తరపున నిలబడతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయకులు బాలరాజ్ గౌడ్, మాజీ ఇన్చార్జ్ వల్లారపు శ్రీనివాస్, హైదరాబాద్ పార్లమెంట్ కో–ఆర్డనేటర్ అన్వర్, నియోజకవర్గ నాయకులు పి.వంశీ కృష్ణ, బాలాజీ గోస్వామి, కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్య‌ర్థి స్వప్న, ఎం.నరసింహ, ఎస్.ప్రకాష్, ప్రదీప్ గౌడ్, వెంకట్, పెద్ద రమేష్, పద్మ, నరేష్ పార్లమెంట్‌ నాయకులు కాసుల సుదర్శన్ రెడ్డి, తడక వినోద్, శ్యామ్ సుందర్, ఓ.వెంకటేష్ చౌదరి, కరణం కిరణ్, భాను ప్రకాష్, ఏబిఆర్ మోహన్, ఎంఎ.సిద్దిఖి, బాలకృష్ణ టి.అనిల్, రాజు నాయుడు, రామారావు, ఎండి.సలీం, విక్రమ్, ఎస్.ఎం.లయీఖ్, గండికోట విజయ్, ఎన్.శ్రీనివాస్, శశిరేఖ, శక్తి ప్రేమ్, యాదగిరి పార్టీ ప్రతినిధులు, నగర నాయకులు, బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page