IND vs SA: ఆ తప్పిదాలే మా ఓటమి..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో రాణించిన సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్.. ఫీల్డింగ్‌ తప్పిదాలతో పాడు పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు అదనపు పరుగులు చేయకపోవడం తమ ఓటమిని శాసించిందని తెలిపాడు. అలాగూ డ్యూ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కష్టమైందని అభిప్రాయపడ్డాడు.

బ్యాటింగ్‌లో మరో 20-25 పరుగుల అదనంగా చేయాల్సిందని, ఫీల్డింగ్ వైఫల్యం కూడా విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. లోయరార్డర్ బ్యాటర్లు ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘ఈ మ్యాచ్‌లో విపరీతమైన మంచు ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. టాస్ ఓడినందుకు ఈ ఓటమికి నేనే బాధ్యత తీసుకోవాలన్నారు. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడం చూడటం చాలా బాగుంది. స్పిన్నర్లను రుతురాజ్ ఎదుర్కొన్న విధానం అద్భుతం. అతను వేగంగా ఆడటంతోనే మాకు 20 పరుగులు అదనంగా లభించాయి. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడమే ఉత్తమమనిపించింది.’అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం సౌతాఫ్రికా ఓవర్లలలో 6 వికెట్లకు పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110) సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రిట్జ్‌కే(64 బంతుల్లో 5 ఫోర్లతో 68), డెవాల్డ్ బ్రెవిస్(34 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page