గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు, పతకాల పంపిణీ

విద్యార్థులకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు, పతకాల పంపిణీ

శివరాంపల్లి, జూలై 22, ( అద్దం న్యూస్ ) :   గత ఏప్రిల్ 26వ తేదీన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 1212 మంది విద్యార్థులు 20 నిమిషాల పాటు ఎడతెగకుండా బేసిక్ కరాటే ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈ రికార్డు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాల పంపిణీ కార్యక్రమం న‌గ‌రంలోని శివరాంపల్లిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేవీన్ నాయక్ కరాటే అకాడమీకి చెందిన నిగ్న సింహారెడ్డి, యశ్విత, చందన, దినేశ్వర్ అనే నలుగురు విద్యార్థులు రికార్డులో భాగమై సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ( SVPNPA ) ( టాక్టిక్స్ ) డిప్యూటీ డైరెక్టర్ కల్మేశ్వర్ షింగేనవర్ హాజ‌రై లచిరాం నాయక్ ( తిరుప‌తి ), ప్ర‌ధాన కోచ్ నవీన్ నాయక్ లతో క‌లిసి క‌రాటే విజేత‌ల‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స‌ర్టిఫికెట్లను ప్ర‌దానం చేశారు. ఈ సందర్భంగా కల్మేశ్వర్ షింగేనవర్ మాట్లాడుతూ… విద్యార్థుల క్రమశిక్షణ, కృషి అభినంద‌నీయ‌మ‌న్నారు. పిల్లల్లోని దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉచితంగా కరాటే శిక్షణ అందిస్తున్నందుకు కోచ్ నవీన్ నాయక్ ను ప్రత్యేకంగా అభినందించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page