...

Alyssa Healy: ఆస్ట్రేలియా కెప్టెన్‌ షాకింగ్‌ నిర్ణయం..

Alyssa Healy: ఆస్ట్రేలియా కెప్టెన్‌ షాకింగ్‌ నిర్ణయం..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మహిళల క్రికెట్‌లో ఒక శకం ముగియనుంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మంగళవారం ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు.

రిటైర్మెంట్‌కు గల కారణం ఇదే..

తన రిటైర్మెంట్‌పై హీలీ మాట్లాడుతూ.. “నాకు ఆస్ట్రేలియా తరఫున మరికొంత కాలం ఆడాలని ఉంది. కానీ, కెరీర్ ఆరంభం నుండి నన్ను నడిపించిన ఆ పోటీతత్వం (Competitiveness) ఇప్పుడు నాలో తగ్గిందనిపిస్తోంది. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

భారత్‌తో సిరీసే ఆఖరిది

వచ్చే నెలలో (ఫిబ్రవరి 15 నుండి) భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్ తన కెరీర్‌లో చివరిదని హీలీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె టీ20 జట్టులో లేనందున, భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆడటం లేదు. స్వదేశంలో భారత్‌తో జరిగే వన్డే, టెస్ట్ సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ తన సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలకనున్నారు. పెర్త్ వేదికగా జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆమె కెరీర్‌లో అత్యంత కీలకం కానుంది. ఫిబ్రవరిలో జరిగే ఈ మెగా సిరీస్ హీలీకి ఘనమైన వీడ్కోలు పలికే వేదిక కానుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.