తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో శాప్ ఛైర్మన్ శివసేనా రెడ్డి ఆధ్వర్యంలో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ = 2025 పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం, స్పీకర్ ప్రసాద్ ఇద్దరు కరాటే ఆడారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిందన్నారు. క్రీడా మైదానాలు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. క్రీడ ఈవెంట్‌లకు తెలంగాణ పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రీడల అభివృద్ధిపై అధిక నిబద్ధత కలిగి ఉందన్నారు. 
















Leave a Reply