మిర్యాలగూడ, ఏప్రిల్ 2 ( అద్దం న్యూస్ ) : తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ నెల 13 వ తేదీన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరుగనున్న జర్నలిస్టుల ఆత్మీయుల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి, తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకుడు అంజన్న పిలుపునిచ్చారు. జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరణ బుధవారం మిర్యాలగూడ అమర వీరుల స్థూపం వద్ద జరిగింది. ఈ సందర్భంగా వారు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అక్రిడేషన్ కార్స్, హెల్త్ కార్డ్స్, ఇంటి స్థలాలు, జర్నలిస్టుల టవర్స్ వంటి హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిన ఇప్పటి వరకు జర్నలిస్టులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ నాయకుడు అంజన్న, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాజేందర్ ప్రసాద్, ఉద్యమ కారుల జేఏసీ నాయకులు పెద్ద యాదగిరి, బాబన్న, శంకర్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply