Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADరాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి

రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి

హైదరాబాద్, ఫిబ్రవరి 26, అద్దం న్యూస్ :    రాబోయే జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు పోటీ చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని ఉద్య‌మ‌కారులు కోరారు. ఈ మేర‌కు గురువారం తెలంగాణ ఉద్య‌మ‌కారులు, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు కల్వ గోపి, రేషం మల్లేష్, అజయ్ ముదిరాజ్, సిరిగిరి శ్యామ్, పున్న సత్యనారాయణ, బిక్షపతి, జోగేందర్, ఎయిర్‌టెల్ రాజు, బాలరాజ్ గౌడ్‌, బ‌ల్లెక‌రి ర‌మేష్‌, రాజు గౌడ్‌, మ‌హేంద‌ర్ గౌడ్, శ్రీనివాస్, వేణుయాదవ్, దేవయ్య, చంద్రశేఖర్ యాదవ్, వంశీ, మందుల నరసయ్య, విట్టల్, అజయ్ త‌దిత‌రులు బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జైసింహ‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. అదే విధంగా పార్టీ పదవుల్లో సైతం తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. ఈ సంద‌ర్భంగా ముఠా జైసింహ మాట్లాడుతూ…ఉద్యమకారులకు ఎన్నికల్లో అవకాశం కల్పించే విధంగా బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప‌లువురు బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page