Saturday, September 19, 2026
No menu items!
HomeAPసనత్‌నగర్‌ నియోజకవర్గంలో హోరెత్తిన ' తెలుగుదేశం – ప్రజాపథం '

సనత్‌నగర్‌ నియోజకవర్గంలో హోరెత్తిన ‘ తెలుగుదేశం – ప్రజాపథం ‘

📰 Generate e-Paper Clip

సనత్‌నగర్‌ నియోజకవర్గంలో హోరెత్తిన ‘ తెలుగుదేశం – ప్రజాపథం ‘
– ప్రజా సమస్యలపై పోరుబాట పట్టాలంటూ టీడీపీ శ్రేణుల పిలుపు !

సనత్‌నగర్‌, జూలై 22, ( అద్దం న్యూస్ ) :    తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడమే లక్ష్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” తెలుగుదేశం – ప్రజాపథం ” కార్యక్రమం బుధవారం సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహభరితంగా జరిగింది. సనత్‌నగర్ డివిజన్ పరిధిలోని ఇ-సేవా కేంద్రం వద్ద పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించడంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్కడి నుండి స్వామి టాకీస్ మీదుగా తులసినగర్ బస్తీలలో పాదయాత్రగా సాగింది. రాష్ట్ర బీసీ సెల్ మాజీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్ ఆద్వర్యంలో సనత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు మల్లేష్, ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాస్ ( గిర్ని సీను ) నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన, సికింద్రాబాద్ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ నల్లెల్ల కిషోర్, ముఖ్య అతిథులుగా హాజరు కాగా పి.బాలరాజ్ గౌడ్, రాష్ట్ర నాయకులు పి.అశోక్, జివిజి.నాయుడు, వల్లారపు శ్రీనివాస్ లు పర్యవేక్షించారు. తులసినగర్ బస్తీల్లో పాదయాత్రగా పర్యటించిన నాయకులతో స్థానిక ప్రజలు, మహిళలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలియజేసారు. ఈ సందర్భంగా తాగునీటి ఎద్దడి ఉందని, వేసవి తీవ్రత దృష్ట్యా బస్తీల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని స్థానికులు వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై మురుగునీరు రోడ్లపై పారుతోందని ఫిర్యాదు చేశారు. రోడ్ల దుస్థితి, బస్తీల్లో డ్రైనేజీ లైన్లు దెబ్బతిని, సీసీ, బీటీ రోడ్లు గుంతలమయమై తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాలలో భాగస్వామి అవుతుందని తెలియజేస్తూ వారి సమస్యలను సంబందిత అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యే వరకు పోరాడతామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల కేటాయింపును తక్షణమే పూర్తి చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ కో–ఆర్డినేటర్ నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ… ప్రైవేట్ పాఠశాలల్లో సాగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యార్థులకు రావలసిన స్కాలర్‌షిప్ బాకీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రాష్ట్ర మహిళా మాజీ ఉపాధ్యక్షురాలు కానూరి జయశ్రీ, బోనాల శ్రీనివాస్ గౌడ్, ఎం.యాదగిరి, మురహరి గౌడ్, ఎమ్ఎస్ఆర్.ప్రసాద్, హెచ్‌.ర‌వికుమార్, తిరుపతి నాయుడు, షమ్మ, జి.కరుణాకర్, మురళి, విష్ణుగౌడ్, జ్యోతి, బి.దేవి, దుర్గ, శ్వేత, అరుణ, శిల్ప, రమేష్, రామ్ సింగ్, వెన్నెల, రాంగోపాల్‌పేట్–బన్సీలాల్‌పేట్ నాయకులు ఎం.రాజు, మహేందర్, సందీప్, శోభ తదితరులు పాల్గొనగా, పార్లమెంటు నాయకులు సుదర్శన్ రెడ్డి, తడక వినోద్, శ్యామ్ సుందర్, కూన శ్రావణ్ గౌడ్, ఓ.వెంకటేష్ చౌదరి, కరణం కిరణ్, భాను ప్రకాష్, కట్ట రాములు, సిహెచ్.విజయశ్రీ, సూర్య దేవర లత, అనిల్, రాజు నాయుడు, రామారావు, ప్రమీల, విక్రమ్, బాలకృష్ణ, విజయ్, శక్తి ప్రేమ్, యాదగిరి బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page