Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadప‌హ‌ల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌దాడులు పిరికిపంద చ‌ర్య‌ – టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్...

ప‌హ‌ల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌దాడులు పిరికిపంద చ‌ర్య‌ – టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

📰 Generate e-Paper Clip

 

ప‌హ‌ల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌దాడులు పిరికిపంద చ‌ర్య‌

♦ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ :  ప‌హ‌ల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌దాడులు పిరికిపంద చ‌ర్య అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప‌హ‌ల్‌గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ … దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ, నిరసనగా గురువారం సికింద్రాబాద్ పారడైజ్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంటు అధ్యక్షుడు సాయిబాబా ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన హాజరయ్యారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… ప‌హ‌ల్గామ్‌లో పర్యాటకులపై అమానవీయంగా దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇది ముమ్మాటికి పిరికి పంద చర్య అని అన్నారు. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రధానమంత్రి అఖండ భారతావని పరిరక్షణమే లక్ష్యంగా ఏనిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటామని, ఆయన తీసుకునే చర్యలకు మా పూర్తి మద్దతు ఉంటుందని, దేశ భద్రతకు విఘాతం కల్పించాలని ఇటువంటి అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఆ ప్రయత్నంలో భాగమే ఈ దాడుల ఉదంతం అని అన్నారు. ఏ అభంశుభం తెలియని అమాయకులపై దాడి చేసి దారుణహత్యలకు పాల్పడడం సరైంది కాదని, నేటి సమాజంలో హింసకు తావు లేదని అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. అనంతరం పార్లమెంటు అధ్యక్షుడు సాయిబాబు మాట్లాడుతూ… మానవ సమాజానికి మనుగడకి విఘాతం కలిగించే రీతిలో ఉగ్రవాదం తయారవుతోందని ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో నిర్మూలించడానికి ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా తమ వంతు భాగస్వామ్యం భాగస్వామ్యమయి సమాజాన్ని కాపాడుకోవాలని, ఈ బాధ్యత నేటి యువతరం పై ఉందని సాయిబాబా అన్నారు. మాజీ శాసనసభ్యులు కాట్రగడ్డ ప్రసన్న మాట్లాడుతూ… ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని దేశ వ్యతిరేక శక్తుల చూస్తున్నాయని అన్నారు ఇది సాధ్యమయ్యేది కాదు, మోడీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు హాజరై ఈఉగ్రవాద చర్యలను ఖండించి నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎం.రాజు, వల్లారపు శ్రీనివాస్, కాసుల సుదర్శన్ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్, ఏబిఆర్ మోహన్, శ్యాంసుందర్, ఝాన్సీ, ప్రమీల, శశిరేఖ, బి.రాజు, విక్రమ్, వెంకటస్వామి, చందర్ ముదిరాజ్, జగదీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page