Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి – మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి – మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు

📰 Generate e-Paper Clip

 

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి

– మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు

 

అంబ‌ర్‌పేట్, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ :   పహల్గామ్‌లో అమాయక పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు అన్నారు. పహల్గాంలో దాడిలో మరణించిన వారికి ఆత్మ శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి మత కులం ఏమి లేదని భవిష్యత్తులో దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద ఏట్టి పరిస్థితిలో సహించేది లేదని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్, యూసుఫ్ జాహి, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోలుపునూరి కృష్ణ గౌడ్, రామ్మోహన్, దనురాజ్ యాదవ్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page