Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADజలమండలి టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్‌కు టీజీఓ శుభాకాంక్షలు

జలమండలి టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్‌కు టీజీఓ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

జలమండలి టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్‌కు టీజీఓ శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 20, ( అద్దం న్యూస్ ) :    జలమండలి టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ జన్మదినం సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు ఎంబి.కృష్ణ యాదవ్, శాఖ సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో గురువారం జలమండలి ప్రధాన కార్యాలయంలోని డైరెక్టర్ టెక్నికల్ చాంబర్‌లో శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీజీఓ ఆఫీస్ బేరర్స్ చంద్రజ్యోతి, టివి.సరస్వతి, అసోసియేషన్ ప్రతినిధులు, జలమండలి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page