Sunday, September 20, 2026
No menu items!
HomeNationalAshes 2025-26: రాణించిన ఇంగ్లండ్ బౌలర్లు.. ఆసీస్ ఆలౌట్

Ashes 2025-26: రాణించిన ఇంగ్లండ్ బౌలర్లు.. ఆసీస్ ఆలౌట్

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌ (Ashes 2025-26)లో ఇంగ్లండ్ పుంజుకుంది. మెల్‌బోర్న్ టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను 152 పరుగులకే కట్టడి చేసింది. యువ బౌలర్ జోష్ టంగ్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఆస్ట్రేలియాలో నేసర్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా రాణించి ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

మొదటి మూడు టెస్టుల్లో ఓటమిపాలయిన ఇంగ్లండ్ జట్టు, మెల్‌బోర్న్ టెస్టులో బౌన్స్ బ్యాక్ అయినట్టు కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లిష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టే ఇంగ్లండ్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేశారు.

ఇంగ్లండ్ యువ బౌలర్ జోష్ టంగ్ అద్భుత బౌలింగ్ లైనప్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్లను తికమక పెట్టాడు. ఓపెనర్ వెధరాల్డ్‌తో పాటు లబుషేన్, స్టీవ్ స్మిత్ వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఆఖర్లో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్న మైకేల్ నేసర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌కు బూస్ట్ ఇచ్చాడు. జోష్ టంగ్ ఐదు వికెట్లు తీసుకోవడంతో ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు సెకండ్ సెషన్‌లోనే కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ 12, జేక్ వెధరాల్డ్ 10, లబుషేన్ 6, స్టీవ్ స్మిత్ 9, ఖ్వాజా 29, అలెక్స్ క్యారీ 20, కామెరూన్ గ్రీన్ 17, మైకేల్ నేసర్ 35, మిచెల్ స్టార్క్ 1, రిచర్డ్‌సన్ 0, బోలాండ్ 0 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్‌సన్ 2 వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ తీసుకున్నారు. జోష్ టంగ్ 11.2 ఓవర్లలో రెండు మేడిన్లు వేసి 45 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లతో సత్తా చాటాడు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page