Sunday, September 20, 2026
No menu items!
HomeNationalRohit Sharma: రోహిత్ శర్మ గోల్డెన్ డక్..

Rohit Sharma: రోహిత్ శర్మ గోల్డెన్ డక్..

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ (Rohit Sharma), రెండో మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ (golden duck) అయి అభిమానులను నిరాశపరిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆడుతున్న ఈ టోర్నీలో రోహిత్ ఆఖరి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటయ్యాడు.

జైపూర్ వేదికగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) గ్రూప్ దశ మ్యాచ్‌లో ముంబై జట్టు రెండో మ్యాచ్ ఆడుతోంది. సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ముంబై, అదే జోష్‌తో ఉత్తరఖండ్‌తో సెకండ్ మ్యాచ్‌కి దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఉత్తరఖండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుని, ముంబైని బ్యాటింగ్‌కి పంపింది. ఉత్తరాఖండ్ పేస బౌలర్ దేవేంద్రసింగ్ బోరా తొలి బంతికే రోహిత్ శర్మను అవుట్ చేశాడు. దేవేంద్ర సింగ్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ నగర్‌కోటీకి క్యాచ్‌కి సున్నా పరుగులకే వెనుదిరిగాడు. దాంతో ముంబై జట్టు సున్నా పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది.

టీమిండియా ఆటగాళ్లందరూ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలంటూ బీసీసీఐ నిబంధన పెట్టడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు అంగీకరించారు. తొలి మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా సెంచరీ చేయగా, రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ డకౌట్‌తో నిరాశ పరిచాడు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page