హైదరాబాద్, అద్దం న్యూస్ : రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్బాటంగా శాసనసభ లో నేడు ఆర్బాటంగా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరువై ఐదు కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు, వివిధ వర్గాలకు కెటాయించిన నిదులు మాటలు బారెడు – చేతలు చారెడు మాదిరిగా ఉన్నాయని ఎంసిపిఐ (యు ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. బడ్జెట్‌పై హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి ఓంకార్ భవన్ నుంచి బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ బడ్జెట్ గత బిఆర్ఎస్ అంకెల గారడీ బడ్జెట్‌గా ఉంది అని పాత సీసాలో కొత్త సారాయి లాగా ఉందని దీనితో రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు పాలక కాంగ్రెస్ పార్టీని చిత్తు గా ఓడిస్తారని.. అందుకు తగిన మూల్యం చెల్లించటానికి కాంగ్రెస్ పాలకులు సిద్దంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉదాహరణకు జనాభా లో 50 శాతం ఉన్న మహిళా, శిశు సంక్షేమానికి కేవలం రూపాయలు 2,862 కోట్లు, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన జనకుల గణనలో నూటికి 56 శాతం ఉన్న బిసిల అభివృద్ధి సంక్షేమానికి రూపాయలు 11, 405 కోట్లు ఏ మూలకు సరి పోతాయి అని నిన్న అసెంబ్లీలో 42 శాతం బిసి రిజర్వేషన్‌కు ఈ నిదులు ఎలా సరి పోతాయన్నారు. షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్ తెగలకు కలిపి చూస్తే రూపాయలు 57, 401 కోట్లు కెటాయించి వాటిని ఎలా ఖర్చు పెడుతారో చెప్పలేదని.. కాగితాల మీద కెటాయింపు తప్ప మరేమీ కాదన్నారు. విద్య, వైద్య కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడుతుందన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply