కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారింది
– ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, సెప్టెంబర్ 6, ( అద్దం న్యూస్ ) : ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం ముషీరాబాద్ డివిజన్ పార్శిగుట్ట చౌరస్తా వద్ద శాంతియుత ఆటో నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహ, తలారి శ్రీకాంత్ ముదిరాజ్ లతో కలిసి ఆటో నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చాక ఆటో కార్మికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోకపోవడంతో అనేక మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం ఆటో కార్మికులనే కాకుండా.. రైతులు, మహిళలు, నిరుద్యోగ యువతను కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి, కొండా శ్రీధర్ రెడ్డి, రేషం మల్లేష్, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్ ,అరుణ్ కుమార్, పోతుల శ్రీకాంత్, సిరిగిరి శ్యామ్, కల్వగోపి, శ్రీధర్ గౌడ్, ముత్యం బాల్‌రాజ్ గౌడ్, శోభారాణి, లక్ష్మణ్ గౌడ్, స్రవంతి, లక్ష్మి, మేరీ, సత్యనారాయణ బాబు, బల్ల ప్రశాంత్, బలవంత్, దీన్ దయాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply