Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadప్రతీ ఇంటికి సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత గత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కింది –...

ప్రతీ ఇంటికి సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత గత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కింది – సికింద్రాబాద్ శాసనసస‌భ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

📰 Generate e-Paper Clip

ప్రతీ ఇంటికి సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత గత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కింది

– సికింద్రాబాద్ శాసనసస‌భ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, సెప్టెంబ‌ర్ 25, అద్దం న్యూస్ :   ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత గత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందని, పేద ప్రజలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలకు ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని సికింద్రాబాద్ శాసనసస‌భ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం బౌద్ధనగర్ కమ్యూనిటీహాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు వివాహాలు భారంగా మారకుండా ఏర్పాట్లు జరిపిన ఘనత తమకే దక్కిందని పద్మారావు గౌడ్ తెలిపారు. పేదల సంక్షేమానికి పాటుపడుతున్నామని, తమ ప్రభుత్వ హయంలో సికింద్రాబాద్‌కు చెందిన అత్యధికులకు ముఖ్యమంత్రి సహాయ నిధి లభించిందని తెలిపారు.

దళారీల ప్రమేయం లేకుండా, డబ్బులు పొందేందుకు ఎవ్వరికీ లంచాలు చెల్లించాల్సి అవసరం లేదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ప్రజలకు నిరంతరం తాము అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, రాసురి సునీత, డిప్యూటీ త‌హ‌శిల్థార్లు చందన, రాజు నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ మండలానికి సంబంధించిన 77 మంది లబ్దిదారులకు, మారేడుపల్లి మండలానికి సంబంధించిన 67 మంది లబ్దిదారులకు సుమారుగా రూ.కోటీ 44 లక్షల విలువ జేసే కళ్యాణ లక్ష్మి, శాది ముబారక్ చెక్కులను పద్మారావు గౌడ్ అందించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page