Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయ‌ల నిధులను మంజూరు చేయాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని...

ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయ‌ల నిధులను మంజూరు చేయాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయ‌ల నిధులను మంజూరు చేయాలి
– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 12, అద్దం న్యూస్ :     గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రకటించిన ఒక కోటి రూపాయల నిధులను వెంటనే మంజూరు చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కోరారు. ఈ మేర‌కు శుక్ర‌వారం జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్ ను కార్పొరేట‌ర్ పావ‌ని క‌లిసి గాంధీనగర్ డివిజన్ అభివృద్ధి పనుల వివరాలతో వినతి పత్రాన్ని అందజేశారు. జిహెచ్ఎంసి నిధులతో పాటు జిల్లా మినిస్టర్ ద్వారా డివిజన్ల అభివృద్ధికి కేటాయించిన మరో 1 కోటి రూపాయలను కూడా మంజూరు చేసి నిధులను అందుబాటులోకి తేవాలని కార్పొరేట‌ర్ పావ‌ని కోరారు. ప్రజాప్రయోజనాలు నిమిత్తం డివిజన్‌లోని అభివృద్ధి పనులను చేపట్టే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని తమకు సహకరించాలని కోరారు. డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న రోడ్డు మరమత్తు పనులు, నూతన రోడ్డు నిర్మాణం పనులు, బస్తీల్లో కావల‌సిన అభివృద్ధి పనులపై దృష్టి సారించి వెంటనే పూర్తి చేయాలని కార్పొరేటర్ పావ‌ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page