Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalన‌గ‌ర గ్రంథాల‌యంలో శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్ల‌మ్మ అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ట మ‌హోత్స‌వాలు ప్రారంభం

న‌గ‌ర గ్రంథాల‌యంలో శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్ల‌మ్మ అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ట మ‌హోత్స‌వాలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 4, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లిలోని న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యం ఆవ‌ర‌ణ‌లో నూత‌నంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్ల‌మ్మ అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ట మ‌హోత్స‌వం ఈ నెల 6వ తేదీన జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా బుధ‌వారం ఆల‌యం వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి గోపూజతో మ‌హోత్స‌వాల‌ను ప్రారంభించారు. గోపూజ‌తో గ‌ణ‌ప‌తి, పుణ్యాఃవాచ‌నం, పంచ‌గ‌వ్య‌ప్రాశ‌స‌, దీక్షాధార‌ణ‌, ఋత్విక్‌వ‌రుణ‌, యాగ‌శాల ప్ర‌వేశం, వాస్తుక్షేత్ర‌పాల‌క‌, యోగినీ, న‌వ‌గ్ర‌హ‌, స‌ర్వ‌లోభ‌ద్ర‌మండ‌వ ఆవాహ‌న‌, అంకురార్ప‌ణ‌, అఖండ దీపారాధ‌న‌, అగ్నిప్ర‌తిష్టాప‌న‌, మండ‌ప పునఃపూజ‌లు, క్షీరాధివాసం, జ‌లాధి వాసం, నీరాజ‌న మంత్ర పుష్పాలు, చ‌తుర్వేద‌స్వ‌స్తి త‌దిత‌ర పూజ‌ల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పద్మజ, ఉద్యోగస్తులు, విశ్రాంతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, గ్రంథాల సిబ్బంది పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page