Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadనిజాం రాజు గుండెల్లో నిదురించిన కవితా వైతాళికుడు మహాకవి దాశరథి రంగాచార్య

నిజాం రాజు గుండెల్లో నిదురించిన కవితా వైతాళికుడు మహాకవి దాశరథి రంగాచార్య

📰 Generate e-Paper Clip

నిజాం రాజు గుండెల్లో నిదురించిన కవితా వైతాళికుడు మహాకవి దాశరథి రంగాచార్య

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ :   నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి అనేక సార్లు జైలు పాలైన తెలంగాణ తొలి తరం మహాకవి దాశరథి రంగాచార్య టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. దాశరథి శత జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్పరించుకుంటూ ఆయనకు మంగ‌ళ‌వారం సాయిబాబా నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… తెలంగాణ సమాజానికి నూతన పౌరుషాగ్నులను రగిలించి, నిజాం రాజు గుండెల్లో నిదురించిన కవితా వైతాళికుడన్నారు. సాయుధ పోరాటానికి దివిటీల నిచ్చిన తెలంగాణ సాహిత్య కుల పెన్నిధి అన్నారు. తెలంగాణ ప్రతిపత్తి కోసం తన కవితల ద్వారా నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన తొలి తెలంగాణ కవి వల్లభుడు దాశరథి అని కొనియాడారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించి, తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటిన గొప్ప కవి అని అన్నారు. తన రచనల ద్వారా తెలంగాణ సమాజాన్ని జాగృత పరిచి, తెలంగాణ సమాజానికి మరింత వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి కొనియాడారు. సాయుధ పోరాటంలో ముందు నిలిచి తెలంగాణ పౌరుషాన్ని, సాహితీ సౌరభాలను ప్రపంచానికి చాటిన మహోన్నతుడని, “నిజాం రాజు జాతికి పట్టిన బూజు” “నిజాం పిశాచమా గద్దె దిగు” అని గర్జించి నాటి ప్రభుత్వ రజాకార్ల నిరంకుశ విధానాలను దాశరథి నిలదీసిన దీశాలి అని అన్నారు. ఆయన శతజయంతి సందర్భంగా దాశరథి అవార్డులు అని ప్రకటించిన రాష్ట్ర ప్ర‌భుత్వం చేతులు దులుపుకుంద‌న్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, తెలంగాణ వారసత్వ కళలను చాటి చెప్పిన మహాకవిని అవమానించమేనని అన్నారు. భవిష్యత్తులో దాశరథి జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని, ఆయన సేవలను గుర్తించి, ప్రజలకు స్ఫూర్తిని కలిగించే ఆయన రచనలను అందుబాటులోకి తేవాలన్నారు. నూతనంగా ఆరాంఘర్ లో నిర్మించ తలపెట్టిన తెలంగాణా ఆర్టీసీ కాంప్లెక్స్ కు దాశరధి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, శ్యామ్ సుందర్, అనిల్ కురుమ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page