Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalఅడిక్‌మెట్‌లో మారుమ్రోగిన అయ్య‌ప్ప స్వామి నామస్మ‌ర‌ణం

అడిక్‌మెట్‌లో మారుమ్రోగిన అయ్య‌ప్ప స్వామి నామస్మ‌ర‌ణం

📰 Generate e-Paper Clip

అడిక్‌మెట్‌లో మారుమ్రోగిన అయ్య‌ప్ప స్వామి నామస్మ‌ర‌ణం

హైదరాబాద్, డిసెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :  హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ ల‌లితాన‌గ‌ర్‌లో అయ్య‌ప్ప స్వామి మ‌హాప‌డిపూజ ఘ‌నంగా జ‌రిగింది. హరిహర పుత్ర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు తలారి వినోద్ కుమార్ ముదిరాజ్ గురుస్వామి ఆధ్వర్యంలో 24 వ అయ్య ప్ప స్వామి మహాపడిపూజతో స్థానికంగా అయ్య‌ప్ప నామ‌స్మ‌ర‌ణ మారుమ్రోగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి జి.కిష‌న్‌రెడ్డి, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు హాజరై స్వా మి వారికి పూజలు చేశారు.          ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… వినోద్ కుమార్ ముదిరాజ్‌ గురుస్వామి గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాలుగా అయ్యప్ప స్వామి పూజా సామగ్రిని అయ్యప్ప స్వాములకు ఉచితంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తలారి చందు, తలారి శ్రీకాంత్ ముదిరాజ్, తలారి వివేక్ ఆనంద్ ముదిరాజ్, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జైసింహ, ముషీరాబాద్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, ఆకుల అరుణ్‌, మీడియా ఇన్‌చార్జ్ ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page