...

ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో పేరుకుపోయిన చెత్త దిబ్బలను తొలగించాలి

ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో పేరుకుపోయిన చెత్త దిబ్బలను తొలగించాలి

  • సిపిఐ (ఎం) ముషీరాబాద్ జోన్ కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంన‌గ‌ర్ డివిజన్ బాగ్‌లింగంప‌ల్లి ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో పేరుకుపోయిన చెత్త దిబ్బలను వెంటనే తొలగించాలని సిపిఐ (ఎం) ముషీరాబాద్ జోన్ కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్ డిమాండ్ చేశారు. రాంనగర్ డివిజన్‌లోని స్థానిక సమస్యల పైన సిపిఐ (ఎం) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వెనకాల ఉన్న ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో స్థానిక సమస్యల పైన సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో రమేష్ హాజరై మాట్లాడుతూ… రాంనగర్‌లోని పలు బస్తీల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎల్ఐజి క్వాట‌ర్స్‌లో డ్రైనేజీ పైప్‌లైన్లు మార్చి మట్టి, చెత్తను రోడ్ల పైన పడవేశారని.. పని పూర్తయి 10 రోజులు గడుస్తున్న వ్యర్ధాలను ఇంతవరకు తొలగించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యం వీడి బస్తీల్లో మట్టి కుప్పలు చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారి సంవత్సరం గడుస్తున్నా స్థానిక సమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ ఇండ్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు మంచి నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి.మహేందర్, నాయకులు డి.సైదులు, సి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.