Friday, September 18, 2026
HomeHyderabadప్రజా దర్బారు కు అతీగ‌తీ లేకుండా పోయింది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్...

ప్రజా దర్బారు కు అతీగ‌తీ లేకుండా పోయింది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్ సాయిబాబా

ప్రజా దర్బారు కు అతీగ‌తీ లేకుండా పోయింది

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్ సాయిబాబా

హైదరాబాద్, జులై 2, అద్దం న్యూస్ :     కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారమయి తమ జీవితాలు మరింత మెరుగు పడతాయని ఎంతగానో ఆశించినా ప్రజలకు భంగపాటు తప్పలేదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్ పిన్న‌మ‌నేని సాయిబాబా అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ…ఎంతసేపు ఇందిరమ్మ ఇళ్లలో తమ వారెవరికి అందజేద్దామా అని, ఇంకా అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మార్చడం వంటి వాటిపై దృష్టి పెట్టడం తప్ప, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల దృష్టి పెట్టడం లేదని అన్నారు. ఎంతసేపు కమిషన్లను దండుకొని ఢిల్లీకి వెళ్లి ముడుపులు అప్పజెప్పడం, తమ పదవులు ఎలా కాపాడుకోవడం వరకే ప్రభుత్వం ఆలోచనలు జరుగుతోందన్నారు. ప్రజా దర్బారులో ఇప్పటివరకు కొన్ని వేల సమస్యలు పరిష్కారం కొరకు ఫిర్యాదులు దాఖలు చేయడం జరిగిందని.. ఎన్ని ఫిర్యాదుల అందినా కూడా వాటి పరిష్కారం కోసం ఇటువంటి శ్రద్ధ చూపడం లేదని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నచ్చి సంవత్సరం ఆరు నెలల కాలం దాటినా ప్రజా దర్బారు పేరుతో జ్యోతిరావు పూలే భవనులో స్వీకరిస్తున్న ఫిర్యాదులకు అతీగతీ లేకుండా పోయిందని అన్నారు. ఉదయం 7 గంటల నుండే ప్రజలు ఎంతో ఆశతో వేచి చూసి ఫిర్యాదులు అందజేస్తే, ఇప్పటి వరకు ఆ ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం మవుతున్నాయి… కానీ ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభంలోకి నెట్టివేయడం జరిగిందన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరమ్మ క్యాంటీనుగా పేరు మార్చడం చేస్తున్నారు.. కానీ పాలనపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. ఎంతోకాలంగా పేద ప్రజల కడుపు నింపుతున్న అన్నపూర్ణ క్యాంటీన్లు పేరు మార్పడం విచారకరమని అన్నారు. అన్నపూర్ణ అంటే కడుపు నింపడం అని అర్థం. దానిని ఇందిరమ్మ క్యాంటినుగా పేరు పెట్టడం తగిన పని కాదని అన్నారు. ఇటువంటి సొంత డబ్బాలు చెప్పుకోవడం మానుకొని ప్రజల హితం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేయాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజా దర్బారులో అందిన ఫిర్యాదుల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెలకిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయ‌కుడు ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page