రిసాల ఖుర్షీద్ జాహీలో బ‌స్తీ ద‌వాఖానా, క‌మ్యూనిటీహాల్‌, అంగ‌న్‌వాడిల‌ను నిర్మించాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు హ‌మ్ వెల్ఫేర్ సొసైటీ విన‌తి

హైదరాబాద్, జులై 2, అద్దం న్యూస్ :   రాంన‌గ‌ర్ డివిజ‌న్‌ రిసాలా ఖుర్షీద్ జాహీలో బ‌స్తీ ద‌వాఖానాను ఏర్పాటు చేయాల‌ని, క‌మ్యూనిటీహాల్ నిర్మించాల‌ని, ప్లే గ్రౌండ్‌ను ఏర్పాటు చేయాల‌ని, అంగ‌న్‌వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని హ‌మ్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వ‌చ్ఛంద సంస్థ అధ్య‌క్షుడు స‌య్య‌ద్ ఎజాజ్ హుస్సేన్ కోరారు. ఈ మేర‌కు బుధ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను క‌లిసి ఎజాజ్ హుస్సేన్ విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా హ‌మ్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వ‌చ్ఛంద సంస్థ అధ్య‌క్షుడు స‌య్య‌ద్ ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ… రిసాల ఖుర్షీద్‌లో హ‌మ్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ ఆధ్వ‌ర్యంలో స‌ర్వే చేశామ‌ని, 12 వేల మంది జ‌నాభా ఉన్న రిసాల ఖుర్షీద్‌లో అనేక స‌మ‌స్య‌లున్నాని అన్నారు. ఈ 12 వేల మంది జ‌నాభాకనుగుణంగా బ‌స్తీ ద‌వాఖానా లేద‌ని, క‌మ్యూనిటీహాల్ లేద‌ని, పిల్ల‌ల కోసం ఆట స్థ‌లం లేద‌ని, చిన్నారుల కోసం అంగ‌న్‌వాడి కోసం లేద‌న్నారు. రిసాల ఖుర్షీద్‌లో బ‌స్తీ ద‌వాఖానాను ఏర్పాటు చేయాల‌ని, క‌మ్యూనిటీహాల్ నిర్మించాల‌ని, ప్లే గ్రౌండ్‌ను ఏర్పాటు చేయాల‌ని, అంగ‌న్‌వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ఎమ్మెల్యే గోపాల్‌ను కోరారు. బ‌స్తీవాసుల స‌మ‌స్య‌ల‌ను, విజ్ఞ‌ప్తుల‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… హ‌మ్ వెల్ఫేర్ సొసైటీ క‌మిటీ ఇచ్చిన విజ్ఞ‌ప్తుల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌న్నారు. రిసాల ఖుర్షీద్ బ‌స్తీలో బ‌స్తీ ద‌వాఖానాను ఏర్పాటు చేయాల‌ని, క‌మ్యూనిటీహాల్ నిర్మించాల‌ని, ప్లే గ్రౌండ్‌ను ఏర్పాటు చేయాల‌ని, అంగ‌న్‌వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పాటుప‌డుతామ‌న్నారు. ఎమ్మెల్యేను క‌లిసిన వారిలో అడ్వ‌కేట్ గంగాధ‌ర్‌, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు శివ కుమార్ యాద‌వ్ త‌దిత‌రులున్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page