Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADభవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

అంబ‌ర్‌పేట‌, మార్చి 28, అద్దం న్యూస్ :  సంక్షేమ బోర్డు నిధులు పథకాలు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, సిఎస్‌సి హెల్త్ పరీక్షలు రద్దు చేయాలని ఈనెల 30వ తేదీ సోమవారం లేబర్ కమిషన్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని అంబ‌ర్‌పేట‌ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక అడ్డాలు బతుకమ్మకుంట, గోల్నాక అడ్డాలు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షుడు జి.రాములు, భవన నిర్మాణ కార్మిక సంఘం నగర ఉపాధ్యక్షుడు డిఎల్ మోహన్ హాజరై మాట్లాడుతూ… భవన నిర్మాణ కార్మికుల ఎర్రజెండా సంఘాలు దశాబ్దాలుగా పోరాడగా వామపక్షాల మద్దతుతో దేవగౌడ ప్రధానిగా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 1996 లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకాన్ని లేబర్ కోడ్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయన్నారు.1996 కేంద్ర చట్టం ప్రకారం కార్మిక ప్రతినిధులతో సంక్షేమ బోర్డు సలహా మండలి ఏర్పరిచి దాని సలహా మేరకు నిధులు ఖర్చు చేయాలి.. కానీ నిబంధనలకు విరుద్ధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించకుండా అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు సంక్షేమ నిధులు దారి మళ్లిస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే హెల్త్ పరీక్షల పేరుతో ఒక కార్మికుల దగ్గర 3,300 రూపాయలు వసూలు చేస్తూ దాదాపుగా రూ.500 కోట్లు దోచిపెట్టిందని విమర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల 50 వేల కార్డులు నమోదవగా లేబర్ ఆఫీసర్లు 1 లక్ష  50 వేలు మాత్రమే రెన్యువల్ చేశారని, దీని వల్ల 10 లక్షల మంది పైన లబ్ధిదారులు నష్టపోతున్నారన్నారు. నిబంధనలకు పాత‌ర‌ వేసి అడ్డగోలు దుబార ఖర్చులు చేస్తూ ఐదు వేల కోట్ల నిధులతో ఉన్న సంక్షేమ బోర్డు ఇప్పుడు రూ.500 కోట్లు కూడా లేకుండా బోర్డ్ దివాలా తీసే విధంగా ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా లేబర్ అధికారులు స్పందించి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్‌ను సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేబర్ కార్డు రెన్యువల్ సందర్భంగా కార్మికుడు లేబర్ ఆఫీస్ కి వచ్చి బయోమెట్రిక్ ఇవ్వాలనే నిబంధన తొలగించాలని, 60 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునికి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ కుంట లేబర్ అడ్డ కార్మికులు తిరుపతి, ధర్మానాయక్, చిట్టి రాజు, కొండబాబు, గోల్నాక అడ్డ కార్మికులు సహదేవ్, నర్సిరెడ్డి, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page