Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadహమాలీ బస్తీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను పరిష్కరించాలి ♦ జిల్లా కలెక్టర్ కు...

హమాలీ బస్తీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను పరిష్కరించాలి ♦ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన లష్క‌ర్ జిల్లా సాధన సమితి సభ్యులు

📰 Generate e-Paper Clip

 

సికింద్రాబాద్, ఏప్రిల్ 21, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్ హమాలీ బ‌స్తీలో గత ప్రభుత్వంలో డిగ్నిటీ హోసింగ్ స్కీమ్ ( డబుల్ బెడ్ రూమ్) లో నిర్మించి ఇచ్చిన వాటిలో 65 ఇండ్లను వివిధ కారణాలతో లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం నిలిపివేసింది. ఈ క్రమంలో ఈ 65 ఇండ్లకు సంబందించిన లబ్ధిదారులు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, సభ్యులను సంప్రదించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి సాధం బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం జ‌రిగిన ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను కలిసి 65 ఇండ్ల లబ్దిదారుల పత్రాలను పరిశీలించి అందులో మిగిలిన పనులను పూర్తిచేసి లబ్దిదారులకు అందచేయవలిసిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ఆర్డిఓ సాయి రామ్ ఇతర అధికారులతో మాట్లాడి 15 రోజులలోగా లబ్దిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారని ల‌ష్క‌ర్ జిల్లా సాధ‌న సమితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాధం బాల్‌రాజ్‌యాద‌వ్ తెలిపారు. లబ్ధిదారులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు శైలందర్, శ్రీకాంత్ రెడ్డి, అజిజ్ తోపాటు లబ్ధిదారులు అంజయ్య, సిహెచ్ జమున, రవి కుమార్, నర్సింగ రావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page