ఖర్గే ఇచ్చిన హామీ మేర‌కు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను అమలు చేయాలి

ఖర్గే ఇచ్చిన హామీ మేర‌కు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను అమలు చేయాలి
– లేదంటే నాలుగు రైళ్లు వేసుకొని ఢిల్లీ వస్తాం.. ఖర్గే ఇంటి ముందు ధర్నా చేస్తం
– మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు

హైద‌రాబాద్‌, మే 26, ( అద్దం న్యూస్ ) :   ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన ఖ‌ర్గే.. డిక్ల‌రేష‌న్‌ను అమలు చేయమని రేవంత్ రెడ్డికి చెప్పు.. లేదంటే నాలుగు రైళ్లు వేసుకొని ఢిల్లీ వస్తాం..మీ ఇంటి ముందు ధర్నా చేస్తం, పోరాటం చేస్తామని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. గిరిజనుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిరసన కార్యక్రమం జరిగింది. చేవెళ్ల రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… పోడు భూములకు పట్టాలు ఇస్తామని రేవంత్ మోసం చేసిండన్నారు. రూ.50 వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను గుంజుకున్న దుర్మార్గ ప్రభుత్వం అని అన్నారు. తిరగబడిన లంబాడీ బిడ్డలకు బేడీలు వేసి జైళ్లకు పంపిండు రేవంత్ రెడ్డి అని, కొడంగల్ లంబాడి బిడ్డలు రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడుతరని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ల పేరిట మోసం చేయడం తప్ప, రూపాయి ఇచ్చింది లేదన్నారు.

చిన్న తండాలను కూడా పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. లంబాడీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఒక్క కేసీఆర్‌ మాత్రమేనని గుర్తు చేశారు. సేవాలాల్ మహరాజ్ ను కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందన్నారు. ముప్పై నెలల్లో సేవాలాల్ కార్పొరేషన్, కొమురం భీం కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి విడుదల చేయలేదని విమర్శించారు. గిరిజనుల హక్కులను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని విమర్శించారు. ఇందిరాపార్క్ నుంచి మొదలైన పోరాటం ప్రతి తండాకు చేరాలన్నారు.

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… చేవెళ్ల రిజర్వేషన్ విషయంలో గిరిజనులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ధర్నాలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు రాంబల్ నాయక్, చందర్ నాయక్, కోటియా నాయక్, భరత్ చౌహన్ నాయక్, అశోక్ నాయక్, బిక్షం నాయక్, దశరథ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page