Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadలష్కర్ జిల్లా సాధన సమితి చేప‌ట్టిన‌ నిరాహార దీక్ష‌కు టిడిపి మ‌ద్ద‌తు

లష్కర్ జిల్లా సాధన సమితి చేప‌ట్టిన‌ నిరాహార దీక్ష‌కు టిడిపి మ‌ద్ద‌తు

📰 Generate e-Paper Clip

లష్కర్ జిల్లా సాధన సమితి చేప‌ట్టిన‌ నిరాహార దీక్ష‌కు టిడిపి మ‌ద్ద‌తు

హైదరాబాద్, డిసెంబ‌ర్ 19, అద్దం న్యూస్ :   హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రజల సౌకర్యార్థం నగరాన్ని రెండు, మూడు విభాగాలుగా విభజించాలనే ప్రతిపాదనతో శుక్ర‌వారం హైద‌రాబాద్ ఇందిరాపార్కు ధ‌ర్నాచౌక్‌లో “లష్కర్ జిల్లా సాధన సమితి” నాయకుడు పవన్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్ష‌కు తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా తో పాటు ప‌లువురు టిడిపి నేతలు మ‌ద్ద‌తు ప‌లికారు.                              ఈ సంద‌ర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… వికేంద్రీకరణతోనే అభివృద్ధి జరుగుతుందని, చిన్న చిన్న రాష్ట్రాలు, పట్టణాల ఏర్పాటు వల్ల పరిపాలన సులభతరమై, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయనిపేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులందరూ ఒకే చోట కేంద్రీకృతమవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని సాయిబాబా అన్నారు. జిహెచ్ఎంసీ కేవలం ఆస్తి పన్నుల వసూలుపైనే దృష్టి పెడుతోందని విమర్శించారు. ప్రజా సమస్యల పట్ల జిహెచ్ఎంసి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నదని, నగరంలో పారిశుద్ధ్యం, ఇతర ప్రజాహిత కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయని, విభజన జరిగితేనే స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం సాధ్యమవుతాయని, పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాల్‌రాజ్ గౌడ్, తడక వినోద్, సొన్నాకుల ప్రకాష్, కిరణ్, మేడిపల్లి శ్యామ్ సుందర్, అడ్డగుట్ట విజయ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page