...

  కుంటి సాకులతో రిజర్వేషన్లకు ఎగనామం పెడితే ఊరుకునేది లేదు – తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్టా బబ్లూ గౌడ్

హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ :   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని, కుంటి సాకులతో రిజర్వేషన్లకు ఎగనామం పెడితే ఊరుకునేది లేదని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్టా బబ్లూ గౌడ్ అన్నారు. శ‌నివారం హైద‌రాబాద్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. 1995లో గెలిచిన సర్పంచులకు కోర్టు ఆదేశాలతో 6 నెలలు అధికారం ఇవ్వని సంఘటనలు పునరావృతం కావద్దన్నారు. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోగా నిర్వహించి, ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని, 30 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని హైకోర్టు బుధవారం రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘంను కోరుతూ తీర్పునిచ్చిన విషయం విధితమేనని కట్టా బబ్లూ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు 2025 మార్చీ 17 న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదంకై పంపించిన బీసీ రిజర్వేషన్ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందాయా ?లేదా ? కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయా లేదా ? తెలియకుండేనని, ఒకవేళ గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి వెళ్లినట్లు అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంటుందని కట్టా బబ్లూ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లులు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాలంటే, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగాలని, వర్షాకాల సమావేశాలు జూలై 21 నుండి ప్రారంభం కానున్నట్లుగా, జూలై 24 వరకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించినందున రిజర్వేషన్ బిల్లుల ఆమోదం కస్ట సాధ్యంగా మారిందని కట్టా బబ్లూ గౌడ్ తన ఆవేదనను వ్యక్తపరిచారు. హైకోర్టు విధించిన గడువు లోపుననే రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో, సమాలోచనలు చేసి, చట్టబద్ధంగా, శాస్త్రీయంగా ఉండే విధంగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై లోతుగా అధ్యయనం చేసి, బీసీ రిజర్వేషన్ బిల్లులకు సంబంధించిన ప్రత్యేక జీఓను జారీ చేయాలని లేదా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించి బీసీ బిల్లులను ఆమోదింప జేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. 1995 లో బీసీ రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ లకు ఆరు మాసాల వరకు హైకోర్టు ఆదేశాల మేరకు అధికారాలు అప్పగించలేదని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కోర్టు చిక్కులు రాకుండా,చట్టబద్ధంగా, శాస్త్రీయంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని, కోర్టు నిర్ణయాన్ని కుంటి సాకుగా చూపించి, కేంద్రంపై నెట్టేసి 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ఎగనామం పెట్టొద్దని,ఎగనామం పెడితే బీసీ వర్గాలు ఊరుకునేది లేదని,తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలాగ,మరో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుందని అన్నారు. కోర్టు తీర్పు ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని టిపిసిసి అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడం హర్షణీయమని బబ్లూ గౌడ్ అన్నారు. భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు రాకుండా, చట్ట బద్ధంగా, శాస్త్రీయంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.