ఓటును అమ్ముకున్నోళ్ళు బిక్షగాలే – మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

ఓటును అమ్ముకున్నోళ్ళు బిక్షగాలే

– మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, ఆగ‌స్టు 29, అద్దం న్యూస్ :    ప్రజాస్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటును నమ్ముకున్నోలే అభివృద్ధి చెందుతారని, అమ్ముకున్నోలు బిక్షగాలుగా ఉంటారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో శుక్రవారం స‌ర్ధార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వారోత్సవాలు, సేవ పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామి గౌడ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు సంఘాల నాయకులు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ… సమాజంలోని కులాల అభివృద్ధి, బహుజనులు బాహుబలిలుగా కావాలంటే కావాల్సింది ఆర్థిక, అధికార బలం ఎంతో అవసరం అని అందుకు అనుగుణంగా బహుజనులు, గౌడ సమాజం ఆ దిశగా కృషి చేయాలని అన్నారు. వైన్ షాపుల్లో రిజర్వేషన్లు పెంచకుండా పాత నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కేటాయింపుల్లో గౌడ సొసైటీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీ కూడా కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచిందని మండిపడ్డారు. వైన్ షాపుల‌ను సొసైటీల‌కు ఇస్తే బాగుప‌డేవ‌న్నారు. ఎన్నిక‌లు ఎన్ని వ‌చ్చినా వ్య‌క్త‌లు ముఖ్యం కాద‌న్నారు. ఎన్ని సంఘాలున్నా స‌రే పార్టీల‌క‌తీతంగా ఆ సంఘాల కార్య‌చ‌ర‌ణ కోసం ప‌ని చేయాల‌ని సూచించారు. స్పాన్స‌ర్‌షిప్ ఉద్య‌మాలు, కార్య‌క్ర‌మాలు ఎక్కువ రోజులు నిల‌బ‌డ‌వ‌న్నారు. గౌడ్‌లు ఆర్థికంగా ఎద‌గ‌డ‌మే నా ల‌క్ష్య‌మ‌న్నారు. త‌మిళ‌నాడు గౌడ్‌ల‌ను చూసి ఆద‌ర్శంగా తీసుకొని, కో ఆప‌రేటీవ్ సిస్ట‌మ్‌గా ముందుకెళ్లాల‌న్నారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో ఇతర కారణాలతో చనిపోయిన కల్లుగీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన ఎక్స్‌గ్రేషియా ఇంత వరకు కాంగ్రెస్ సర్కార్ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా విస్మరిస్తుందని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకొని గౌడ కులస్థుల సమస్యలను పరిష్కరించకుంటే అన్ని గౌడ సంఘాల నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామనిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్సం సోమన్న గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటేష్ గౌడ్, వివిధ గౌడ సంఘాల నాయకులు బాలగౌని బాలరాజ్ గౌడ్, విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page