Saturday, September 19, 2026
No menu items!
Homecinemaఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్‌ ప్రొ లీగ్‌

ఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్‌ ప్రొ లీగ్‌

📰 Generate e-Paper Clip

ఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్‌ ప్రొ లీగ్‌

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  సినీ ప్రముఖులు పాల్గొనే టాలీవుడ్‌ ప్రొ లీగ్‌ (టీపీఎల్‌) క్రికెట్‌ టోర్నీ ఫిబ్రవరి 13 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఆదివారం ఈ లీగ్‌ ట్రోఫీని, జెర్సీని సినీ, క్రికెట్‌ ప్రముఖులు ఆవిష్కరించారు. దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్, మాజీ స్టార్‌ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్‌ రైనాలతో పాటు సినీ నిర్మాత దిల్‌ రాజు, నటుడు సోనూ సూద్, సంగీత దర్శకుడు తమన్, నటి రాశీ ఖన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపిల్, సెహ్వాగ్, దిల్‌ రాజు, సోనూ సూద్‌ కలిసి స్నేహపూర్వక క్రికెట్‌ మ్యాచ్‌ ఆడారు. ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ క్రికెట్‌ పట్ల ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు.

హైదరాబాద్‌ అందమైన నగరమే కాదు, రుచికరమైన వంటకాలకు కేంద్రమని కొనియాడారు. వీరేంద్ర సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. సినిమా రంగానికి చెందిన నటులు, టెక్నీషియన్లు కలిసి క్రికెట్‌ లీగ్‌ ఆడటం మంచి పరిణామమన్నారు. దిల్‌ రాజు మాట్లాడుతూ.. తెర మీద కనిపించే నటులతో పాటు తెర వెనుక ఉండి పని చేసేవారితో కలిసి టీపీఎల్‌ టోర్నీ జరుగుతుందన్నారు. ఆరు జట్లతో కూడిన ఈ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లో ప్రముఖ నిర్మాతలు జట్లకు యజమానులుగా వ్యవహరిస్తారని రాజు తెలిపారు. సినీనటుడు ఆశిష్‌ విద్యార్థి, దర్శకుడు అనిల్‌ రావిపూడి, ఈబీజీ గ్రూప్‌ అధ్యక్షుడు ఇర్ఫాన్‌ ఖాన్, టీపీఎల్‌ వ్యవస్థాపకుడు వంశీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page