Friday, September 18, 2026
HomeHyderabadరైళ్ల‌ల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ – ల్యాప్‌టాప్‌, ఐ ప్యాడ్, 13 సెల్‌ఫోన్లు...

రైళ్ల‌ల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ – ల్యాప్‌టాప్‌, ఐ ప్యాడ్, 13 సెల్‌ఫోన్లు స్వాదీనం

కాచిగూడ, మే 27, అద్దం న్యూస్ :   రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేష‌న్‌లో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డిఎస్పీ ఎస్ఎన్ జావేద్, కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్ట‌ర్‌ ఆర్.ఎల్లప్ప, ఆర్‌పిఎఫ్ కాచిగూడ ఇన్‌స్పెక్ట‌ర్‌ గోరఖ్నాథ్ మల్ వివరాలు వెల్లడించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గోషామహాల్ ప్రాంతానికి చెందిన నవనీత్ శర్మ (32) అనుమానస్పదంగా ఉండగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల 21వ తేదీన ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్‌, ఐఫోన్, ఇతర వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. విచారణలో నవనీత్ శర్మ వైన్ షాపులు, బస్ స్టాఫ్లు, రైల్వే స్టేషన్లలో 12 మొబైల్ ఫోన్లను దొంగిలించినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి రూ.2,70,000 విలువైన ఒక ల్యాప్‌టాప్‌, ఐఫ్యాడ్, 13 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నవనీత్ శర్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగను పట్టుకున్న రైల్వే పోలీస్ సిబ్బందిని రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ చందన దీప్తి ఐపిఎస్, ఐజీపీ కె.రమేష్ నాయుడు అభినందించారు. వారికి తగిన రివార్డులు అందించనున్నట్లు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page