ఆకట్టుకున్న శ్రీపాదార్చన రూపక ప్రదర్శన – డాక్టర్ అర్థ‌ నారీశ్వరం వెంకట్‌కు శ్రద్ధాంజలి ఘటించిన కళాకారులు

ఆకట్టుకున్న శ్రీపాదార్చన రూపక ప్రదర్శన

 డాక్టర్ అర్థ‌ నారీశ్వరం వెంకట్‌కు శ్రద్ధాంజలి ఘటించిన కళాకారులు

                         ఆకట్టుకున్న శ్రీపాదార్చన రూపక ప్రదర్శన

సిటీ కల్చరల్, మే 27, అద్దం న్యూస్ :    తెలంగాణ ప్రభుత్వ భాషా, సంస్కృతి శాఖ సౌజన్యంతో నృత్య దర్పణ, దర్పణ ఎక్స్‌ప్రెషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీపాదార్చన నాట్య రూపక ప్రదర్శన రవీంద్రభారతిలో ప్రదర్శించి ప్రముఖ పండితుడు డాక్టర్ అర్థ‌ నారీశ్వరం వెంక‌ట్‌కు ఘనంగా నివాళులర్పించారు. శ్రీ వెంకటేశ్వరుడు, పద్మావతీ అమ్మవారి మధ్య ఆధ్యాత్మిక ప్రేమ, వియోగం, తిరుగమలిన ఏకతను ఆధారంగా చేసుకున్న నాట్యం భక్తి, తపన, మానసిక స్థితిగతుల ద్వారా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. అలివెలుమంగమ్మ పాత్రలో చర్మిల వెంకట్ తన హావభావాలతో ఆకట్టుకోగా, అన్నమయ్య పాత్రలో ఋత్విక్ వెంకట్ తన ఆధ్యాత్మిక భావాన్ని చక్కగా ప్రదర్శించారు. నారదుని పాత్రలో రూపేష్ దువ్వి తన హాస్యరసంతో నాట్యానికి ఉత్సాహం నింపారు. సురభి నిఖిలేష్ వేసిన వెలుగులతో వేదిక ఆరంజన కళాఖండంగా నిలిచాయి. ఆ విశిష్ట కాంతి ప్రదర్శన ప్రతి దృశ్యానికీ ప్రాణం పోసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు ఆచార్య టి.గౌరీ శంకర్, కథక్ కళాక్షేత్ర డైరెక్టర్ అంజు బాబు, సంజయ్ కుమార్ జోషి, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page