మల్టీ జోనల్ స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేయాలి


హైదరాబాద్, ఆగస్టు 20, అద్దం న్యూస్ : మల్టీ జోనల్ స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేయాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు జీహెచ్ఎంఏ రాష్ట్ర కార్యదర్శి హేమచంద్రడు, టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్, ఎస్‌టియు ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్, పీఆర్‌టియూటీఎస్ రాష్ట్ర అసోసియెట్ అధ్యక్షుడు శ్రీనివాస్ లక్ష్మన్న, ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారీ, బండారి మధు, వేణుగోపాల్ రావు రత్నాకర్ రావు, మూర్తి, విష్ణు వర్ధన్ రెడ్డి, దామోదర్ రెడ్డి సుమారు 200 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంఏ రాష్ట్ర కార్యదర్శి హేమచంద్రడు, టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్, ఎస్‌టియు ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ లు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం మల్టీ జోన్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత మల్టీ జోన్–I ను 19 జిల్లాలలతో మల్టి జోన్–II ను 14 జిల్లాలతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టును మల్టీ జోన్ స్థాయికి మార్చారన్నారు. 2015 తర్వాత వివిధ కారణాలతో ఆగిపోయిన పదోన్నతులను 8 సవంత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సెప్టెంబర్ 2023 లో షెడ్యూల్ ప్రకటించి మొదటి సారిగా మల్టీ జోనల్ స్థాయిలో పదోన్నతులు నిర్వహించి సుమారు 2000 మంది ఉపాధ్యాయులకు మల్టీజోన్ – I, II లలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
నూతన మల్టీజోన్ వ్యవస్థ వల్ల జిల్లా స్థాయిలో సీనియారిటీ వ్యత్యాసం వలన ప్రమోషన్ పొందిన వారు, వారు పనిచేస్తున్న జిల్లాలు కాకుండా అప్పుడు బదిలీల తరువాత ఏర్పడిన మారుమూల ప్రాంతాల జిల్లాలకు కేటాయించబడి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయులు దాదాపు 720 మంది కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో పని చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గత రెండు సవంత్సరాలుగా పదవీ విరమణ వలన ఏర్పడిన ఖాళీలు ప్రతి జిల్లాలో ఉన్నందున బదిలీలు నిర్వహిస్తే మల్టీజోన్ వ్యవస్థ వల్ల సుదూర ప్రాంతాలలో పనిచేస్తు ఆరోగ్య రీత్యా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రధానోపాధ్యాయులు వీరిలో వితంతువులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం అని అన్నారు. వీరంతా గత నాలుగు దశాబ్దాలుగా విద్యాశాఖలో బదిలీలు నిర్వహించి తద్వారా ఉత్పన్నమైన ఖాళీలలో పదోన్నతులు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించినచో కొంత మేరకు వారి కుటుంబాలకు దగ్గరగా పని చేసి అవకాశం లభించి తద్వారా మానసిక ఒత్తిడికి గురికాకుండా పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 902 ప్రధానోపాధ్యాయ పోస్టులను పదిన్నతితో నింపాలని అధికారులు యోచిస్తున్నట్టు వార్త వినిపిస్తుందన్నారు. గత 40 సంవత్సరాలుగా విద్యాశాఖలో బదిలీలు నిర్వహించి ప్రమోషన్ ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించాలని ఉపాధ్యాయులు అన్ని ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రాల ద్వారా అధికారులను కోరారన్నారు. మొదటగా బదిలీ నిర్వహించి ఆ తదుపరి ప్రమోషన్స్ ఇవ్వాలని సీనియర్ ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా చూడాలని అందుకే మొదటగా బదిలీలు నిర్వహించి తదనంతరం ప్రమోషన్స్ ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. మొదటగా బదిలీ నిర్వహించి ప్రమోషన్స్ ఇవ్వాలని అధికారులను, మంత్రులను, పిసిసి అధ్యక్షుడిని ఉపాధ్యాయులు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మా విజ్ఞప్తిని మన్నించి సమీక్షించి మొదటగా బదిలీలు నిర్వహించాలని కోరారు. గత ప్రభుత్వం తెచ్చిన మల్టీ జోన్ వ్యవస్థ వల్ల ఏర్పడిన అవస్థల నుండి విముక్తి కలిగించాలని, అందుకే బదిలీలు నిర్వహించాలని, ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply