త్రిశూల్ యూత్ రాంనగర్ కా రాజా లడ్డు వేలం పాట
– 5 లక్షల 70 వేలకు లడ్డుకు దక్కించుకున్న కడివేలు సాయి కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 07, అద్దం న్యూస్ : వినాయక నవరాత్రులు ముగిశాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు వినాయక మండపాల్లో గణేష్ లడ్డూల వేలం పాట జరిగింది. నియోజకవర్గంలోని అడిక్మెట్ త్రిశూల్ యూత్ రాంనగర్ కా రాజా లడ్డు వేలం పాట జరిగింది. ఈ లడ్డు వేలం పాటలో సాయి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టేషన్ నిర్వాహకుడు కడివేలు సాయి కుమార్ 5 లక్షల 70 వేలకు లడ్డును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా త్రిశూల్ యూత్ రాంనగర్ కా రాజా అసోసియేషన్ నిర్వాహకులు సాయి సంతోష్, రాజు, దినేష్, రఘు, సాయి మహేష్, శివానంద్ తదితరుల ఆధ్వర్యంలో లడ్డూను దక్కించుకున్న కడివేలు సాయి కుమార్ కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply