...

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 07, అద్దం న్యూస్ :   తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామ‌ని సాహితి వేత్త, అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అబ్బాస్ అన్నారు. ఆదివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రం ఐల‌మ్మ ఆర్ట్ గ్యాల‌రీలో సాహిత్య‌, సాంస్కృతిక కార్యకర్తల రాష్ట్ర సమావేశం టిపిఎస్‌కె, తెలంగాణ సాహితి సంయుక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాహితి వేత్త, అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అబ్బాస్ మాట్లాడుతూ… తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చారిత్రాత్మకమైనదని, భవిష్యత్తు ఉద్యమాలకు మార్గదర్శకమైనదని ఈ పోరాట నిజ చరిత్రను బావి తరాలకు బాధ్యతగా తీసుకుపోవాలన్నారు. ” కమ్యూనిస్టులే వీర తెలంగాణ వారసులు – మతోన్మాదులకు మాట్లాడే హక్కు లేదు “ ఘంటాపథంగా కళారూపాల ద్వారా తెలియచేయాలన్నారు. కమ్యూనిస్టుల పాత్ర -మతోన్మాదుల వక్రీకరణలను చిత్రిస్తూ.. విరివిగా సాహిత్యాన్ని తీసుకురావాలని, కవులు కవితలు, కళాకారులు పాటలు, ఆనాటి రచనలను తిరిగి పునర్ముద్రించాలని, ఆనాటి నవలలను నాటికలుగా మార్చాలని అన్నారు. సాయుధ పోరాట హారంలో మణిపూసలైన అమరవీరుల వీరగాధల్ని ఏకపాత్ర భినయాలుగా మలచాలని, అమరవీరుల యాది లో శౌర్య యాత్రలు నిర్వహించాల‌న్నారు. అమరుల కుటుంబాలను క‌ల‌వాల‌ని యువకులతో షార్ట్ ఫిల్మిలు తీసే విధంగా ప్రోత్సహించాలని, అట్టి సినిమాలను ట్రావెలింగ్ థియేటర్ ద్వారా గ్రామాల్లో ప్రదర్శించి పాత తరానికి మరోసారి గుర్తు చేయడం, నేటి తరానికి ఆ పోరాట స్ఫూర్తిని నింపాలన్నారు. మతోన్మాదుల వక్రీకరణలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట వ్యాధులు కవితా గానం ఈ నెల 14న ఆదివారం మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం 8 గంటల వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించాలని, తెలంగాణ సాహితీ టీపీఎస్‌కె సంయుక్తంగా నిర్వహస్తుందని కవులు రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1945 నుండి 1951 వరకు సాగిన పోరాటాలలో సేకరించిన ఫోటోలు ఎగ్జిబిషన్ నిర్వహించాలని.. ఇవి నాలుగు కూడలిలో పెట్టి పిల్లలకు పెద్దలకు ఆనాటి పోరాట స్ఫూర్తిని ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేయాలని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పాటలు పాతవి, కొత్తవి సేకరించడం కళాకారులతో వర్క్ షాప్ పెట్టి పాటల శిక్షణ ఇచ్చి పాటల్ని ప్రజల్లోకి అలాగే నిజ చరిత్రను తీసుకువెళ్లాలన్నారు. ఈ నెల 15 నుండి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట పాటకు పరిపరి దండాలు అంటూ వామపక్ష సాంస్కృతిక సంస్థలచే కల్చరల్ నైట్ లు పల్లె పల్లెన జరగాలన్నారు.

తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి కె.ఆనందాచారి మాట్లాడుతూ… ఈ నెల 21 నుండి ప్రారంభమై 31 వరకు బతుకమ్మ పండుగలో కవయిత్రుల వర్క్ షాప్ లు కవి సమ్మేళనాలు నిర్వహించి బతుకమ్మ, తెలంగాణ ప్రత్యేకత చాటేలా ఉత్సవమే కాదు ఉద్యమంగా తీసుకెళ్ళాలని అన్నారు. టిపిఎస్‌కె కార్యదర్శి కె.హిమబిందు మాట్లాడుతూ… బతుకమ్మ పాటలు మహిళల సమస్యలపై పాటలు రాయించాలని, వాటిని రికార్డు చేయించాలన్నారు. మహిళా సంఘాలు మహిళా బృందాలు కోలాటం లాంటి సాంస్కృతిక బృందాలు ఇలా అందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఈ నెల 28 న గుర్రం జాషువా జయంతోత్సావాలు అన్ని కేంద్రాలలో నిర్వహించాలని, కలిసోచ్చే అన్ని సంఘాలను కలుపుకొని కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామ‌న్నారు. ఈ కార్యక్రమంలో టిపిఎస్‌కె భువనగిరి కన్వీనర్ కొండ మడుగు నర్సింహ, సాంస్కృతిక కార్యకర్త కె.శాంతా రావు, టిపిఎస్‌కె అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, జి.రాములు, తెలంగాణ సాహితి మెహనకృష్ణ, జి.యాదగిరిరావు, సలిమా, అయోధ్య‌, రామయ్య, నాగేశ్వరరావు, కురుమూర్తి, ఏభూసి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.