బాధిత కుటుంబానికి ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత

బాధిత కుటుంబానికి ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత

తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కారణంతో ఆత్యహత్యాయత్నం

అండగా నిలిచిన స్వ‌చ్ఛంద‌ సంస్థ

– దాతలు ముందుకు రావాలని పిలుపు

అంబ‌ర్‌పేట్‌, మే 24, అద్దం న్యూస్ :   భర్త వెన్నుముకకు తీవ్ర గాయమై పనిచేయలేకపోతున్న స్థితిలో ఉండగా భార్యకు ఒకటే కిడ్నీ ఉండి, అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. కుమారుడికి సైతం రెండు సర్జరీలు జరిగి పనిచేని ఉండడంతో కుటుంబం సమస్యల వలయంలో చిక్కుకు పోయింది. ఆత్మహత్యనే దిక్కు అనుకున్న కుటుంబాన్ని ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆదుకుంది. బతకలేమని పరిస్థితి నుంచి వారికి జీవనోపాధి కల్పించేలా చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. సంతోష్, ప్రియాంక అనే దంపతులు కొద్ది రోజులుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. దీనికి తోడు అనారోగ్య సమస్యలు వేధిస్తుండటంతో, బంధువులు సైతం పట్టించులేని పరిస్థితి. గత మూడు నెలలుగా ఇంటి అద్దె, కరెంట్ బిల్లు కూడా చెల్లిద్దామన్న డబ్బులు లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేద్దామని భావించారు. ఈ విషయం ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులకు తెలియడంతో హుటాహుటిన ఆ కుటుంబం వద్దకు వెళ్లారు. సంస్థ తరఫున చెక్కు అందజేసి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా, జీవనోపాధి కోసం ఏదైనా చిరు వ్యాపారం పెట్టించేలా చూస్తామని భరోసానిచ్చారు. దాతలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి, బాధిత కుటుంబాన్ని పెద్ద మనసుతో ఆదుకునేందుకు చేతులు కలపాలని ట్రూ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ట్రూ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు మారమోని శ్రీశైలం యాదవ్, ప్రధాన కార్యదర్శి మేకల కార్తిక్ యాదవ్, ట్రెజరర్ కంది లోకేష్ , సభ్యులు మొత్త రాజేంద్రప్రసాద్, సాయి, నాని పాల్గొన్నారు సహాయం చేయాలనుకున్న వారు 9640317586 ను సంప్రదించాలని కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page