త్వ‌ర‌లో సూర్యాపేట‌లో టియు జేఏసి బ‌హిరంగ స‌భ

హైదరాబాద్, న‌వంబ‌ర్ 19, అద్దం న్యూస్ :    త్వ‌ర‌లో సూర్యాపేట‌లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ( టియు జేఏసి ) బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు పిడ‌మ‌ర్తి లింగ‌య్య అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం సూర్యాపేట జిల్లా నేత‌ల‌తో స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ… ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలోని అన్ని తెలంగాణ ఉద్య‌మ సంఘాలు, పార్టీల నాయ‌కుల‌తో స‌మావేశ‌మై బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసే విష‌యం పై ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. తెలంగాణ ఉద్య‌మ‌కారులకు ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ఉపాధ్య‌క్షుడు మోహ‌న్ బైరాగి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌సాద్‌, టియుకెవి అధ్య‌క్షుడు వేముల యాద‌గిరి, గోనె విజ‌య‌, సుజాత‌, ఎల్ల‌మ్మ‌, సుగుణ‌మ్మ‌, ల‌క్ష్మ‌మ్మ‌, రామ‌ల‌క్ష్మీ, ఉమ‌, సునీత‌, దేవకి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page