Friday, September 18, 2026
HomeHyderabadతెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి అధ్యక్షుడిగా తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి

తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి అధ్యక్షుడిగా తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి

తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి అధ్యక్షుడిగా తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి



హైదరాబాద్, జులై 11, అద్దం న్యూస్ :   తెలంగాణ ఉద్యమకారుల ప్రయోజనాలే లక్ష్యంగా టియుజేఏసి అభివృద్ధికి పాటుపడుతామని టియుజేఏసి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (టియుజేఏసి ) రాష్ట్ర కార్యాలయంలో అత్యవసర రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం సర్పంచుల సంఘం నాయకులు మంచాల వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన టియుజేఏసి సభ్యుల సమక్షంలో గత 11 నెలలుగా టియుజేఏసి చేసిన కృషిని రిపోర్టు రూపంలో పాతకమిటిలో సెక్రెటరీ జనరల్ గా తుమ్మల రాంరెడ్డి సమీక్ష సమావేశంలో ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చ అనంతరం పాత కమిటిని రద్దుచేసి, నూతన కమిటిని ఏర్పాటు చేసుకోవవడం జరిగిందని తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ఉద్య‌మ‌కారుల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌న్నారు. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను సాధించుకునే దిశ‌గా ఉద్య‌మ‌కారుల ప్ర‌యాణం సాగుతున్న క్ర‌మంలో కొంత మంది అరాచ‌క‌వాదులు త‌మ వ్య‌క్తిగ‌త రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం టియుజేఏసిలో చీలిక‌లు తెచ్చి సంస్థ‌ను నిర్వీర్యప‌రిచే కుట్ర‌ల‌ను ప‌సిగ‌ట్టి వారిని సంస్థ నుంచి బ‌హిష్క‌రించామ‌న్నారు. వారికి టియు జేఏసితో ఎటువంటి సంబంధంలేద‌న్నారు.

టియుజేఏసి నూతన కమిటీ :

తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి గౌర‌వాధ్య‌క్షుడిగా ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌, తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి అధ్యక్షుడిగా తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ముఖ్య స‌ల‌హాదారుడిగా బోయ‌ప‌ల్లి రంగారెడ్డి, స‌ల‌హాదారులుగా శంక‌ర్‌రావు, అన్వ‌ర్ ప‌టేల్‌, గొల్ల‌ప‌ల్లి ద‌యానంద్‌, వర్కింగ్ ప్రసిడెంట్లుగా మంచాల వెంకటస్వామి, తుల్జారెడ్డి, మార్వాడి సుదర్శన్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా చర్చల చంద్రన్న ప్రసాద్, ఏవి.రావు, బాకారం లావణ్య, ఉపాధ్య‌క్షులుగా మోహ‌న్ బైరాగి, అంజ‌లి కుమారి, కంచ‌ర్ల బ‌ద్రి, ఇందిర‌, ల‌క్ష్మీ కాంత‌మ్మ‌, జాయంట్ సెక్ర‌ట‌రీలుగా కాంప‌ల్లి సాయిలు, హ‌రికృష్ణ‌, సాంస్కృతిక విభాగం రాష్ట్ర క‌న్వీన‌ర్‌గా వేముల యాద‌గిరి, రాష్ట్ర కో-క‌న్వీన‌ర్‌గా రాజేష్ లు నియ‌మితుల‌య్యారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page