టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మ‌హ‌త్య – కుటుంబ క‌ల‌హాలే ఆత్మ‌హ‌త్యకు కార‌ణమా

హైదరాబాద్, జూన్ 27, అద్దం న్యూస్ :   తెలంగాణ టీవి యాంక‌ర్‌, జర్నలిస్టు, రచయిత స్వేచ్ఛ వోటార్కర్ ( 40 ) బలవన్మరణానికి పాల్ప‌డింది. ఆత్మ‌హ‌త్య చేసుకుంది. హైద‌రాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జవహర్‌న‌గ‌ర్‌లో తాను నివసిస్తున్న ఇంటిలోనే శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి…స్వేచ్ఛ గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా చిక్క‌డ‌ప‌ల్లి గాంధీన‌గ‌ర్‌లో స‌లాం ల‌త నిల‌యం పెంట్ హౌస్‌లో నివ‌సిస్తుంది. స్వేచ్ఛ‌కు 9వ త‌ర‌గ‌తి చ‌దువుకుంటున్న కూతురు ఉంది. స్వేచ్ఛ గ‌త 20 సంవ‌త్స‌రాలకు పైగా ప్ర‌ముఖ తెలుగు టీవీ ఛాన‌ల్ల‌ల్లో న్యూస్ ప్ర‌జెంట‌ర్‌గా ప‌ని చేస్తుండేవారు. ఇదిలా ఉండ‌గా స్వేచ్ఛ ఇంటికి త‌ల్లి శ్రీదేవి శుక్ర‌వారం రాత్రి వ‌చ్చింది. ఆమె కుమార్తె ఇంటికి తలుపు తాళం వేసి ఉండటం గమనించిన ఆమెకు స్వేచ్ఛ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని క‌నిపించింది. దీంతో విష‌యాన్ని స్థానికుల‌కు చెప్ప‌డంతో త‌లుపు ప‌గుల‌కొట్టారు. విష‌యాన్ని స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. విష‌యం తెలుసుకున్న చిక్క‌డ‌ప‌ల్లి ఏసిపి ర‌మేష్‌, చిక్క‌డ‌ప‌ల్లి సిఐ రాజు నాయ‌క్ లు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స్వేచ్చ‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను పిలిపించారు. కానీ ఆమె అప్ప‌టికే మృతి చెందిన‌ట్టు వైద్యులు తెలియ‌చేశారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి త‌ర‌లించారు. చిక్కడపల్లి పోలీసులు ఆమె మరణానికి గల కారణాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ క‌ల‌హాలే ఆత్మ‌హ‌త్యకు కార‌ణమా  :

స్వేచ్ఛకు ఇది వరకే వివాహం అయ్యి సుమారు 13 ఏళ్ళ కూతురు ఉండగా.. కొన్ని కారణాల వల్ల మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. టీ న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణ చందర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న స్వేచ్ఛ.. గత కొంతకాలంగా పూర్ణ చందర్‌తో విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పూర్ణ‌చంద‌ర్‌తో క‌లిసి అరుణాచ‌లం కు వెళ్లి ఇద్ద‌రు క‌లిసి యోగాసానాలు చేసిన‌ట్టు దిగిన ఫోటోల‌ను స్వేచ్ఛ మూడు రోజుల క్రితం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page