హైదరాబాద్, అద్దం న్యూస్ : సూర్యాపేట జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.నరసింహ ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ తరపున మెమోంటోను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయిని శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు పాల్వాయి జానయ్య, నాంపల్లి శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి బుక్కా రాంబాబు, సంయుక్త కార్యదర్శి వంగాల వెంకన్న తదితరులు జిల్లా ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply