ద్విచ‌క్ర వాహ‌నాల  దొంగ అరెస్ట్

 

ద్విచ‌క్ర వాహ‌నాల  దొంగ అరెస్ట్

 

హైదరాబాద్, మే 15, అద్దం న్యూస్ :   న‌గ‌రంలో పార్కింగ్‌ల్లో ఉండే ద్విచ‌క్ర వాహ‌నాల‌ను త‌స్క‌రించి త‌ప్పించుకుని తిరుగుతున్న పాత నేర‌స్తుడిని చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేర‌కు నిందితుడి అరెస్ట్‌ను మీడియాకు చూపించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో చిక్క‌డ‌ప‌ల్లి సిఐ రాజునాయ‌క్‌, డిఐ శంక‌ర్‌, ఎస్ఐ అభిలాష్‌ల‌తో క‌లిసి చిక్క‌డ‌ప‌ల్లి ఏసిపి ర‌మేష్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ముషీరాబాద్ పార్శిగుట్ట హ‌నుమాన్ దేవాల‌యం వ‌ద్ద నివ‌సించే మంతెన కృష్ణంరాజు అలియాస్ కృష్ణ ( 44 ) వృత్తిరీత్యా రోజువారి కూలీగా ప‌ని చేస్తుంటాడు. డబ్బు కోసం దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతుంటాడు. ఈ క్ర‌మంలోనే 2024 డిసెంబ‌ర్ 7వ తేదీన ఆర్టీసి క్రాస్‌రోడ్‌లోని నివేదిత హాస్పిట‌ల్ వీధిలో పార్కింగ్‌లో ఉన్న ద్విచ‌క్ర వాహ‌నాన్ని దొంగ‌త‌నం చేశాడు. పార్కింగ్‌లో ఉన్న త‌న ద్విచ‌క్ర వాహ‌నం క‌నిపించ‌లేద‌ని, చోరీకి గురైంద‌ని గుర్తించిన బాధితుడు డివి.సురేష్ బాబు 2025 జ‌న‌వ‌రి 4వ తేదీన చిక్క‌డ‌ప‌ల్లి పిఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో సిసి టివి పుటేజీల ఆధారంగా ఈ నెల 15వ తేదీన నిందితుడిని అదుపులోకి తీసుకున్న చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు విచారించ‌గా చోరీ చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు గ‌తంలో చిల‌క‌ల‌గూడ‌, నారాయ‌ణ‌గూడ‌, వార‌సిగూడ‌, లాలాగూడ‌, న‌ల్ల‌కుంట త‌దిత‌ర పోలీస్‌స్టేష‌న్ల ప‌రిధిలో ద్విచక్ర వాహ‌నాల‌ను చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి వ‌చ్చాడు. అత‌ని అరెస్ట్ చేసిన పోలీసులు 7 ద్విచ‌క్ర వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు త‌ర‌లించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page