హైదరాబాద్, అద్దం న్యూస్ : నగరంలోని ఇందిరాపార్క్‌లో ఉగాది పండుగ శ్రీ విశ్వవసు నామ సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వాకర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, కవాడిగూడ కార్పొరేటర్ జి.రచన శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగ శ్రవణం విన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి మందం శ్రీనివాస్ ముదిరాజ్, సాయి, తిరుపతి రెడ్డి, ప్రభాకర్, ఆర్‌కె.శ్రీనివాస్ ముదిరాజ్, హిప్నో పద్మా కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply