Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఏకగ్రీవంగా జమిస్తాన్‌పూర్‌ గౌడ సంఘం ఎన్నిక‌లు

ఏకగ్రీవంగా జమిస్తాన్‌పూర్‌ గౌడ సంఘం ఎన్నిక‌లు

📰 Generate e-Paper Clip

ఏకగ్రీవంగా జమిస్తాన్‌పూర్‌ గౌడ సంఘం ఎన్నిక‌లు

హైదరాబాద్, డిసెంబ‌ర్ 2, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం జెమిస్తాన్‌పూర్ పార్శిగుట్ట‌ గౌడ సంఘం ఎన్నికలు ఏక‌గ్రీవమైంది. 2015 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఎన్నిక త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల 2025 వర‌కు జ‌ర‌గ‌లేదు. గౌడ సంఘంలోని కొంద‌రు స‌భ్యులు గౌడ సంఘం ఎన్నిక కోసం కోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు తీర్పు రావ‌డానికి ఆల‌స్యం జ‌రుగుతున్నందువ‌ల్ల గౌడ సంఘం స‌భ్యులు స‌ర్వ‌స‌భ్య స‌మావేశాన్ని నిర్వ‌హించి మెజారిటీ స‌భ్యుల నిర్ణ‌యం మేర‌కు ఫైవ్ మెన్ క‌మిటీని ఏర్పాటు చేసుకొని రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, ఎన్నిక‌ల ఆఫీస‌ర్ డాక్ట‌ర్‌.డి.జ‌నార్థ‌న‌రావు ను సంప్రదించి న్యాయ‌బ‌ద్దంగా ఎన్నిక‌ను నిర్వ‌హించాల‌ని కోరారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల అధికారి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసి, గౌడ‌ సంఘం గౌరవ సభ్యులందరికీ రిజిస్టర్ పోస్టు ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ పంపించారు. పేప‌ర్ నోటిఫికేష‌న్ కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. న‌వంబ‌ర్ 27వ తేదీన నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగ‌గా, డైరెక్ట‌ర్ల పోస్టు కోసం జ‌రిగిన ఈ ఎన్నిక‌లో 9 మంది నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. కుల పెద్ద‌ల సూచ‌న‌ల మేర‌కు ఎన్నిక‌ల‌ను ఏక‌గ్రీవంగా ఆమోదించి ఎన్నిక‌ల అధికారి ఆధ్వ‌ర్యంలో గౌడ సంఘం నూత‌న క‌మిటీని ఏర్పాటు చేసుకోవ‌డం జ‌రిగింది. ఈ క‌మిటీ మూడు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉంటుంద‌ని ఎన్నిక‌ల ఆఫీస‌ర్ జ‌నార్థ‌న రావు తెలిపారు.

జెమిస్తాన్‌పూర్ గౌడ సంఘం నూత‌న క‌మిటీ ఇదే :

జెమిస్తాన్‌పూర్, పార్సిగుట్ట గౌడ సంఘం ఎన్నికలలో రంగకృష్ణ గౌడ్ వర్గం వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్య‌క్షునిగా రంగ‌కృష్ణ‌గౌడ్ ఎన్నిక‌కాగా, ఉపాధ్య‌క్షుడిగా అత్తిలి సూర్యనారాయణ గౌడ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ర‌కాల వేణుబాబు గౌడ్‌, సంయుక్త కార్య‌ద‌ర్శిగా పి.రాము గౌడ్‌, కోశాధికారిగా బూడిద క‌ర్న ప్ర‌కాష్ గౌడ్‌, డైరెక్ట‌ర్లుగా తడక వెంకటేష్ గౌడ్, మారగొని దయానంద్ గౌడ్, మన్సురాబాద్ మల్లేష్ గౌడ్, కె.బాల్ మల్లేష్ గౌడ్ లు ఎన్నిక‌య్యారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page