...

వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి – ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి – తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం చైర్మన్ శివరాత్రి అయిలమల్లు

వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

– ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి

– తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం చైర్మన్ శివరాత్రి అయిలమల్లు


హైదరాబాద్, ఆగ‌స్టు 31, అద్దం న్యూస్ :    వడ్డెరలను బీసీ జాబితా నుండి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో వ‌డ్డెరలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం చైర్మన్ శివరాత్రి అయిలమల్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ గౌరవాధ్యక్షుడు పిట్ల మల్లేశం అధ్యక్షతన తెలంగాణ వడ్డెర సంఘం 8 వ వార్షికోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన శివరాత్రి అయిలమల్లు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా వడ్డెర ప్రజల బ్రతుకులలో ఎలాంటి మార్పు లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎస్టీ జాబితాలో చేర్చాలని, వడ్డెర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనులలో వడ్డెర కాంట్రాక్టర్లకు 25 శాతం పనులు కేటాయించాలన్నారు. బండ క్వారిలపై 20 శాతం హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. వడ్డెర కార్మికులు ప్రమాదవశాస్తూ మరణిస్తే 20 లక్షలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. రాజకీయ నాయకులు వడ్డెరలను వెనుకబాటుకు గురిచేసి ఓట్ల కోసం పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.             గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు వివిధ సభలలో పలుమార్లు వడ్డెరలను బీసీ జాబితా నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఉప్పల్ భగాయత్ లో వడ్డరులకు కేటాయించిన భూమిలో ఆత్మగౌరవ భవనం ఏర్పాటు చేయాలని, నామినేటెడ్ పదవులలో వడ్డెరలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉదృతమైన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి మల్లేష్, తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బోదాసు నరసింహ, వైస్ ప్రెసిడెంట్ వరికుప్పల భూపాల్ ( ఆర్కే ), కొంచెం దేవరాజు, వెంకటేష్, శివరాత్రి రామయ్య, మహిళా అధ్యక్షురాలు శివరాత్రి ఉమా, శివరాత్రి రాజమ్మ, పుల్లపు పద్మ, శారద తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.