జూనియర్ సివిల్ జడ్జ్‌గా ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థిని
వదినపల్లి రత్నకుమారి నియామకం
హైదరాబాద్, మే 14, ( అద్దం న్యూస్ ) : జూనియర్ సివిల్ జడ్జ్‌గా ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థిని వదినపల్లి రత్నకుమారి నియామకమయ్యారు. రామన్నపేట భువనగిరి యాదగిరి జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జ్‌గా విధులను నిర్వర్తిస్తున్న రత్నకుమారి తాను చదువుకున్న ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ పాఠశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పులిగారి గోవర్థన్‌రెడ్డి, పి.స్వర్ణలత లు రత్నకుమారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కరస్పాండెంట్ పులిగారి గోవర్థన్‌రెడ్డి, ప్రిన్స్‌పాల్ స్వర్ణలత, ఉపాధ్యాయులకు రత్నకుమారి ధన్యవాదాలు తెలియచేశారు. తన ఎదుగుదలకు ఈ పాఠశాల తనకు ఇచ్చిన బేసిక్ స్టాండర్డ్స్ వల్లే ఇది సహాయపడిందని రత్నకుమారి గుర్తు చేశారు. మా పాఠశాల పూర్వ విద్యార్థిని వదినపల్లి రత్నకుమారి ఈ స్థాయికి చేరుకోవడం చాలా అభినందించదగ్గ విషయమని కరస్పాండెంట్ పులిగారి గోవర్థన్‌రెడ్డి తెలిపారు.













Leave a Reply