36 బంతుల్లోనే సూపర్ సెంచరీ..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బిహార్ తరఫున సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే శతకం బాది రికార్డ్ సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం 156* పరుగులతో (61 బంతుల్లో; 14 ఫోర్లు, 13 సిక్స్‌లు) క్రీజులో కొనసాగుతున్నాడు. 18 ఓవర్లు ముగిసే సమయానికి బిహార్ జట్టు 1 వికెట్ కోల్పోయి 206 పరుగులు చేసింది. పీయూష్ సింగ్ 9* (8 బంతుల్లో, 1 ఫోర్) క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 26 బంతుల్లో 49* పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరో ఓపెనర్ మంగళ్ మహరూర్ 33 (43 బంతుల్లో, 4 ఫోర్లు) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో టెక్కీ నేరి ఒక వికెట్ తీసుకున్నాడు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply