అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బిహార్‌కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌కు ఇప్పుడు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని న్యూఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ స్వీకరించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇటీవల ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కేవలం 36 బంతుల్లోనే సెంచరీ, 84 బంతుల్లో 190 పరుగులతో రికార్డు సృష్టించాడు.
పురస్కార ప్రదానోత్సవం అనంతరం, వైభవ్ (Vaibhav Suryavanshi)తో పాటు ఇతర అవార్డు గ్రహీతలు ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలుసుకోనున్నారు. దేశ యువతలో ప్రేరణ నింపే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్రికెట్ రంగంలో అద్భుత ప్రతిభను కనబరిచినందుకుగాను ఈ పురస్కారం వైభవ్ (Vaibhav Suryavanshi)కు దక్కింది. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అతడి కెరీర్‌లో ఓ చారిత్రక ఘట్టంగా నిలిచింది.
అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా వైభవ్ (Vaibhav Suryavanshi) విజయ్ హజారే ట్రోఫీ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అనేది 5 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఇచ్చే భారతదేశ అత్యున్నత పౌర గౌరవం, సాహసం, కళ – సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజి, సామాజిక సేవ, క్రీడల్లో ప్రతిభ చూపిన బాలలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply