Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఎమ్మెల్సి కోదండరాం జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

ఎమ్మెల్సి కోదండరాం జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సి కోదండరాం జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 5, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు ఎం.కోదండరాం జన్మదిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, జన సమితి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జమిస్తాన్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 9, 10 తరగతుల‌ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడలను, పెన్నులను కోదండరాం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ… విద్య అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర అని అన్నారు. గత సంవత్సరంలో ఈ పాఠశాల నుంచి జిల్లా స్థాయిలో ప్రధమ ర్యాంక్ సాధించిన విధంగానే రానున్న సంవత్సరంలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భవాని మాట్లాడుతూ… కోదండరాం లాంటి వ్యక్తి మా పాఠశాలకు రావడం అదృష్టమని, ఆయన స్ఫూర్తితో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను సేవలను అందించడానికి కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య మాట్లాడుతూ… కోదండరాం బర్త్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సమితి నగర ఉపాధ్యక్షుడు పి.జయపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కాకునూరి సుధాకర్, బిసి సెల్ అధ్యక్షుడు జస్వంత్, ఆలయ కమిటీ నిర్వాహకులు తిరుమల, నాయకులు నాగభూషణం, పిల్లి రవీందర్ నారు తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్‌లో పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ :
కోదండరాం జన్మదిన సందర్భంగా గాంధీనగర్ డివిజన్ అశోక్‌న‌గ‌ర్ లేబ‌ర్ అడ్డాలో కేక్ కటింగ్ చేసి వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి ముషీరాబాద్ క్యాలెండర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page