వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ లు రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్ల‌ను స‌ద్వినియోగం చేసుకోండి – వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు, టిపిసిసి ఉపాధ్య‌క్షుడు ప‌ట్లోళ్ల సంగ‌మేశ్వ‌ర్‌

హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ :     వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ లు రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్ల‌ను స‌ద్వినియోగం చేసుకొని ప్ర‌త్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు, టిపిసిసి ఉపాధ్య‌క్షుడు ప‌ట్లోళ్ల సంగ‌మేశ్వ‌ర్ అన్నారు. టిపిసిసి ఉపాధ్య‌క్షుడిగా ప‌ట్లోళ్ల సంగ‌మేశ్వ‌ర్ నియ‌మితులైన సంద‌ర్భంగా వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ సంఘం రాష్ట్ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఆయ‌న‌కు స‌న్మానం జ‌రిగింది. ఆదివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సంగ‌మేశ్వ‌ర్‌కు గ‌జ‌మాల‌లు వేసి, శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు, టిపిసిసి ఉపాధ్య‌క్షుడు ప‌ట్లోళ్ల సంగ‌మేశ్వ‌ర్ మాట్లాడుతూ…సంఘమైనా, పార్టీలో అయినా ఎన్నో ఆటుపోట్లు ఉంటాయ‌ని, వాటిని భ‌రించాల‌న్నారు. ప్ర‌భుత్వాలు ఇస్తున్న రిజ‌ర్వేష‌న్ల ప్రకారం వీర శైవ లింగాయ‌త్‌లు ఆలోచించాల‌న్నారు. 42 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు అయితే వాటిని స‌ద్వినియోగం చేసుకొని ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌న్నారు. టిపిసిసి ఉపాధ్య‌క్షుడిగా తన‌కు అవ‌కాశం ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్‌గౌడ్‌ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాన‌న్నారు. పార్టీకి చేస్తున్న సేవ‌ల‌ను గుర్తించి టిపిసిసి ఉపాధ్య‌క్షుడిగా పార్టీ నాకు అవ‌కాశం ఇచ్చింద‌ని, పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేస్తాన‌న్నారు. అలాగే వీర శైవ లింగాయ‌త్‌లు ఎప్పుడు వ‌చ్చినా ఏ ప‌ని ఉన్నా న‌న్ను సంప్ర‌దించండి.. నాతో అయ్యేడిది ఉంటే త‌ప్ప‌కుండా ఆ ప‌ని చేస్తాన‌న్నారు. రాష్ట్రంలో సంఘాన్ని మ‌రింత ప‌టిష్ట‌ప‌ర్చాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ఈ కార్య‌క్రమంలో వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ సంఘం సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్ శెట్టి శివ కుమార్‌, వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ సంఘం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దినేష్ పాటిల్‌, రాష్ట్ర కోశాధికారి క‌ల్ల‌ప‌ల్లి రాచ‌ప్ప‌, వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు శివ చ‌ర‌ణ్‌, యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు భ‌ర‌త్‌, యువ‌జ‌న విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్వ‌ర్‌, మ‌హిళా విభాగం కోశాధికారి అశ్విని ల‌తో పాటు సెంట్ర‌ల్ క‌మిటీ, జిల్లా క‌మిటీ, మండ‌ల క‌మిటీ నాయ‌కులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page